Clsr

Recent Posts

How to Improve Immunity Power in Telugu

ఇమ్యూనిటీపవర్
చలికాలంలో ఈ ఉష్ర్టాసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా పెరిగి అవి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక అన్నిరోగాలకు ఒత్తిడి మూలం. వీపును వెనక్కి వంచడం ద్వారా శరీర ఊర్ధభాగంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల గుండె, ఊపిరితిత్తులు రిలాక్స్ అవుతాయి. ఈ ఆసనం మూలంగా.. ఇమ్యూనిటీపవర్‌ని పెంచుకోవడమే కాకుండా, ఒత్తిడిని దూరం చేయొచ్చు...
yoga4

ఏకపాద ఉష్ర్టాసనం
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి దూరంగా ఉంచాలి. వెనుకగా పాదాలను భూమికి ఆనించాలి. ఒక చేతిని నడుము మీద ఉంచి రెండో చేతిని వెనుకగా తిప్పి కాలి మడమను పట్టుకోవాలి. గాలి పీల్చుకొని నడుమును ముందుకు తోయాలి. తర్వాత తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో సాధారణంగా గాలిపీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలివదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా రెండు వైపులా మూడుసార్లు చేయాలి.
yooga1


ఉష్ర్టాసనం - 1
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచాలి. వెనుకగా పాదాలను భూమికి ఆనేటట్లుగా ఉంచాలి. రెండు చేతులను వెనుకగా తిప్పి కాలి మడమలను పట్టుకోవాలి. గాలిపీల్చుకొని నడుమును ముందుకు తోయాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో సాధారణంగా గాలిపీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలివదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.
yoga5

ఉష్ర్టాసనం - 2
ముందుగా వజ్రాసనంలో కూర్చోని రెండు మోకాళ్లను ఒకదానికొకటి దూరంగా పెట్టాలి. వెనుకగా పాదాలను భూమికి ఆనేటట్లుగా ఉంచాలి. రెండు చేతులను వెనుకగా తిప్పి, అరచేతులను అరికాళ్లపై ఆన్చాలి. గాలిపీల్చుకొని నడుమును ముందుకు తోయాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచి ఈ స్థితిలో సాధారణంగా గాలిపీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలివదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.
yoga3
ఉష్ర్టాసనం - 3
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి దూరంగా ఉంచాలి. వెనుకగా పాదాలనువేళ్లు భూమికి ఆనేటట్లుగా ఉండనివ్వాలి. రెండు చేతులను వెనుకగా తిప్పి అరికాళ్లకు తగలకుండా... కాళ్లకు సమాంతరంగా చేతులను నేలకు ఆన్చాలి. గాలిపీల్చుకొని నడుమును ముందుకు తోయాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో సాధారణంగా గాలి పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలివదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.

ఉపయోగాలు :
-వెన్నెముకను దఢపరుస్తుంది.
-ఊపిరితిత్తుల పనితీరును బాగా మెరుగుపరుస్తుంది.
-థైరాయిడ్ గ్రంథి పనితీరును క్రమబద్దీకరిస్తుంది.
జాగ్రత్తలు :
-గుండె జబ్బులు, హెర్నియా, వెన్నెముక సమస్యలు ఉన్నవారు చేయకూడదు.
గమనిక
-యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.